Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తు వాయిదా ఉత్తర్వుల పొడిగింపు
- నిందితుల నేరాలకు ఆధారాలు ఉన్నాయన్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసును సీబీఐకి అప్పగించాలంటూ నిందితులు హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు దర్యాప్తును వాయిదా వేయాలంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు జస్టిస్ బి.విజరు సేన్‌రెడ్డి ప్రకటించారు. దర్యాప్తువాయిదా ఉత్తర్వుల ను రద్దు చేయాలని ప్రభుత్వం చేసిన వినతిని తోసిపుచ్చారు. నిందితులను కస్టడీలోకి తీసుకునేం దుకు ఆ ఉత్తర్వులు అవరోధంగా ఉన్నాయంటూ ప్రభుత్వం చెప్పగా, ఈ నెల 7న విచారణలో ఆ విషయాలను తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు సీబీఐ లేదా సిట్లకు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు విచారించింది. ఇదే సమయంలో ఎర కేసు నిందితు లు రామచంద్రభారతి, నంద కుమార్, సింహ యాజిలు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ శుక్ర వారం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహాలో నందు సతీమణి చిత్రలేఖ కూడా పిటిషన్ దాఖలు చేశారు. తీన్మార్ మల్లన్న కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ 7న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసుల్ని వ్యతిరేకరిస్తూ ప్రభుత్వం 200 పేజీలకుపైగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలు ప్రయత్నాలకు ఆధారాలు ఉన్నాయనీ, బీజేపీలో చేరాలని కూడా నిందితులు కోరారనీ, ఈ వ్యాజ్యా లను కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. సమగ్ర కౌంటర్ పిటిషన్‌ను లోతుగా పరిశీలించి తమ వాదనలు చెప్పేందుకు గడువు కావాలని ప్రేమేందర్ రెడ్డి తరపు న్యాయవాది కోరారు. అయితే మెయినా బాద్ పీఎస్‌లో నమోదైన కేసు దర్యాప్తును నిలిపి వేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.
భద్రాచలానికి ఎన్నికలు నిర్వహిస్తాం
భద్రాచలంతో పాటు మరో నాలుగు గ్రామాలను పంచాయతీలుగా కొనసాగిస్తామనీ, ఈ మేరకు అసెంబ్లీ సమావేశాల సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీబీ భాస్కర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం, ఆయా ఎన్నికలపై తగిన నిర్ణయం తీసుకోని పక్షంలో తదుపరి విచారణలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని చెప్పింది. అంతే కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని విచారణకు పిలిపించుకుని వివరణ కోరతామని తెలిపింది. ఏజెన్సీ ఏరియాల్లో పంచాయతీలను మున్సిపాల్టీలుగా మార్చడానికి వీల్లేదంటూ ఎస్.వీరయ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. భద్రాచలాన్ని మున్సిపాల్టీగా మారుస్తూ వెలువడిన జీవోను సవాల్ చేస్తూ వై.రాజు రిట్ దాఖలు చేశారు. వీటిని గురువారం హైకోర్టు విచారించింది. ఎన్నికలు నిర్వహించకుండా వాయిదా వేయడం సరి కాదని అభిప్రాయపడింది. విచారణను ఈ నెల 25కి వాయిదా వేసింది.
'మెట్రో'కు నోటీసులు
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద మెట్రో వాణిజ్య నిర్మాణాన్ని ఆపాలంటూ దాఖలైన కేసులో హైదరా బాద్ మెట్రో రైల్ లిమిటెడ్‌కు హైకోర్టు నోటీసులిచ్చి ంది. ఈ నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రమ వుతాయంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టి స్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురు వారం విచారించింది. పిటిషనర్ ఎం. ఇంద్ర సేనా చౌదరి వ్యక్తిగతంగా విచారణకు హాజరై ఏ విధమైన ట్రాఫిక్ సమస్యలు, వస్తాయో వివరిం చారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్), హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ కౌం టర్ దాఖలు చేయాలని ఆదేశించి విచారణ వాయిదా వేసింది.
రాజాసింగ్ కేసు విచారణ 8కి వాయిదా
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాజాసింగ్‌పై పీడీ కేసు కొట్టే యాలంటూ దాఖలైన కేసు విచారణ ను హైకోర్టు ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఆయన భార్య టి.ఉషాభారు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను బుధవారం జస్టిస్ ఎ. అభిషేక్ రెడ్డి, జస్టిస్ జె.శ్రీదేవి ధర్మా సనం గురువారం విచారణను కొన సాగించింది. ఏజీ వాదిస్తూ, అన్ని కేసుల్లో 41ఏ కింద నోటీసులు జారీ అవసరం లేదని తెలిపారు.
ప్రభుత్వ ఉత్తర్వుల నిలిపివేత
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ అసోసియేష న్లు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల అమలు నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించింది. ఈ నెల 15న అధికారులతో సమావేశమైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ అసోసియేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో ప్రక్షాళన, బోగస్ కమిటీలను రద్దు చేయాలనీ, జిల్లాలో అసోసియేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణ యించారు. ఇది బీసీసీఐ నిబంధనలకు, జస్టిస్ ఆర్ఎం లోథా కమిటీ సూచనలకు విరుద్ధమని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ హైకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. క్రికెట్ అసోసియేషన్ల ఏర్పాటు అనేది రాష్ట్ర మంత్రి, ఏసీబీ డైరెక్టర్ జనరల్ పరిధిలోకి రాదని వాదించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ను కొట్టేయాలని కోరింది. తదుపరి విచారణను ఈనెల 16న జరుపుతామనీ హైకోర్టు స్పష్టం చేసింది.
ఎమ్మెల్సీ మధుసూదనాచారికి నోటీసులు
గవర్నర్ కోటాలో అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారిని నియమించడాన్ని సవాల్ చేసిన కేసులో ఆయనకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగ విరుద్ధంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలను నియమిస్తున్నారంటూ టి.ధన్‌గోపాల్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గతంలో గోరేటి వెంకన్న, బస్వరాజ్ సారయ్య, దయానంద్ లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో నియమించ డాన్ని ఆయన 2020లో సవాల్ చేశారు. ఈ కేసులో ముధుసూదనాచారిని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ తరపు న్యాయవాది వేణుమాధవ్ కోరారు. ఇందుకు అనుమతిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం గురువారం మధుసూదనాచారికి నోటీసు లు జారీ చేసింది. విచారణను డిసెంబర్ 7కి వాయిదా వేసింది.