Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మన రాష్ట్రంలో 950 కంటే ఎక్కువ రెసిడెన్సియల్ విద్యాసంస్థలతో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచిందని షెడ్యుల్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆయా సంస్థల్లోని విద్యార్థులకు ఉపయోగపడేందుకు మాస్ మ్యూచువల్ సంస్థ ముందుకు రావడం ప్రశంసనీయమన్నారు. అంతర్జాతీయంగా ఫైనాన్స్ రంగంలో పేరుగాంచిన ఆ కంపెనీ మంత్రితో పాటు దళిత అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌బొజ్జ సమక్షంలో గురువారం హైదరాబాద్‌లో పరస్పర అవగాహనా ఓప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేకంగా 45 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అట్టడుగునున్న బాలికలను ప్రోత్సహిస్తూ.. ఉన్నత స్థాయికి చేరుకోవడానికి సహాయపడే దష్టితో ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. తెలంగాణ సాంఘీక, గిరిజన సంక్షేమ రెసిడిన్షియల్ విద్యాసంస్థల సొసైటీల కార్యదర్శి రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ, అవసరమైన నైపుణ్యాలను అందించాలనే లక్ష్యంతో మహిళా డిగ్రీ కళాశాలల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం డేటా సైన్స్ క్యాంపులు, ఇండిస్టియల్ ఎక్స్ పోజర్ సందర్శనలను నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు తమ కుటుంబ మూలాలను మరిచిపోవద్దని కోరారు. నైతిక విలువలు, సమగ్రతలను నిలబెట్టాలని వారికి సూచించారు.