Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షల ఫలితాల్లో అభ్యర్థులకు తీవ్ర నష్టం జరిగిందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వలీఉల్లా ఖాద్రీ, కె. ధర్మేంద్ర తెలిపారు. ఇతే అంశంపై గురువారం హైదరాబాద్లో ఆ సంఘం ఆధ్వార్యాన వినూత్న రీతిలో మోకాళ్లపై నిలబడి, చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రశ్నాపత్రాల్లో వచ్చిన తప్పిదాలను గుర్తించి, తగిన విధంగా మార్కులు కలపకుండా ఫలితాలు వెల్లడించడంతో లక్షలాది మంది అభ్యర్ధులు నష్టపోయారని తెలిపారు.దీనిపై తగిన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర నాయకులు సురేష్, శంకర్, లింగం రవి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.