Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎస్‌కు వీఆర్ఓల వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వీఆర్ఓలను రీ-డిప్లాయి మెంట్ పేరుతో వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన సందర్భంగా తలెత్తిన సమస్యలను పరిష్కరిం చాలని తెలంగాణ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ అసోసియేషన్ గౌర వాధ్యక్షులు, రాష్ట్ర వీఆర్ఓల కన్వీ నర్ వింజమూరి ఈశ్వర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు వినతిపత్రం సమర్పిం చారు. సర్దుబాటు సమయంలో తమ సీనియార్టీని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధన లకు విరుద్ధంగా స్థానిక సంస్థలు, సొసైటీల్లో రీ డిప్లాయిమెంట్ చేశా రని ఫిర్యాదు చేశారు. కొన్ని శాఖల్లో వీఆర్ఓలకు సమాన స్థాయి కానీ పోస్టుల్లో నియమిస్తే, మరి కొన్ని శాఖల్లో పోస్టుపై స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. మరి కొన్ని శాఖ ల్లో ఐడీ నెంబర్లను మార్చారనీ, అర్హత ఆధారంగా కాకుండా లాటరీ పద్ధతిలో పోస్టింగ్ ఇచ్చి ఉరిశిక్షతో సమానమైన శిక్ష వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్లలో మూడో తేదీ నుంచి జాయిన్ అయినట్టు నమోదు చేస్తామని హామీ ఇచ్చి అందుకు భిన్నంగా కొన్ని శాఖలు మూడో తేదీ, మరి కొన్ని ఐదో తేదీ, ఇంకొన్ని ఆరో తేదీ అంటూ వివిధ రకాలుగా ఇచ్చారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఒకే జాయినింగ్ తేదీ ఇవ్వాలనీ, వార్డు ఆఫీసర్లకు జాబ్ చార్టును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకే శాఖలో విధులు నిర్వహిస్తున్న వారికి మ్యూచువల్ అవకాశం కల్పించాలని కోరారు.