Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉత్తర్వులు జారీ చేసిన టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ఏసీ బస్సుల్లో కూడా రాయితీతో కూడిన ప్రయాణానికి అనుమతిస్తూ టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు వీరికి ఆర్డినరీ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో మాత్రమే కాంప్లిమెంటరీ బస్‌పాస్‌లు చెల్లుబాటు అయ్యేవి. ఇప్పుడు ఆ పాస్‌లు ఏసీ బస్సుల్లోనూ చెల్లుబాటవుతాయని తెలిపారు. ఇటీవల పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు ఆయన్ని బస్‌భవన్‌లో కలిసి వినతిపత్రం ఇవ్వగా, సానుకూలంగా స్పందించి, ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ పోలీసుశాఖ, ఆర్టీసీ మధ్య అనినాభావ సంబంధం ఉందనీ, రెండు సంస్థలు ప్రజాసేవలో భాగంగా సమాజ రక్షణ, సురక్షిత ప్రయాణం అందిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులకు కాంప్లిమెంటరీ పాసులు అందచేశారు.