Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విప్లవ విద్యార్థి అమరుల స్మారక వారోత్సవాలను శనివారం నుంచి ఈనెల 11 వరకు నిర్వహించనున్నట్టు పీడీఎస్యూ (విజృంభణ) ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయసిడం బాపురావు, ప్రధాన కార్యదర్శి అల్లూరి విజరు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్యూ నిర్మా త జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ 1975, నవంబర్ ఐదున ఇల్లందులో కాల్చి చంపబడ్డారనీ, అదేనెల 11న రంగవల్లి విప్లవ ఉద్యమ నాయకురాలిగా ములుగు అడవుల్లో నెలకొరిగారని పేర్కొన్నారు.