Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ వరలక్ష్మి, జాతీయ అధ్యక్షురాలు, మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కార్మికులకు ఉండాల్సిన పనివిధానం లేకుండా స్కీం వర్కర్లను విభజించి, ప్రభుత్వా లు పనులు చేయించుకుంటున్నా యంటున్న ఎస్ వరలక్ష్మి 'నవతెలంగాణ'తో ప్రత్యేకంగా మాట్లాడారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు, పరిష్కారా లు అమె మాటల్లోనే...
''ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులను నేరుగా, స్వయం సహాయక బృందాలుగా, స్వచ్ఛంద సంస్థల రూపంలో నియమించుకుంటున్నాయి. కనీస వేతనాలు ఇవ్వాల్సి వస్తాయనే కారణంతో కార్మికులకు ఉండాల్సిన పని లక్షణాలు, విధానం లేకుండా జాగ్రత్తపడుతున్నాయి. రాష్ట్రంలో 26 లక్షల మంది మధ్యాహ్న భోజన కార్మికులు, 28 లక్షల మంది అంగన్వాడీలు, 5 లక్షల మంది ఆశావర్కర్లు ఉన్నారు. ఆయా రంగాల వర్కర్లు అంతా సంఘటితమై డిమాండ్ల కోసం ప్రభుత్వాలపై వత్తిడి తెస్తుంటే, ఆ స్కీంలనే రద్దు లేదా నిర్వీర్యం చేసే దిశగా కేంద్రప్రభుత్వం విధాన నిర్ణయాలు తీసుకుంటున్నది. గతంలో వందశాతం నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తన వాటాను 60 శాతానికి పరిమితం చేసి, 40 శాతం నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చాలని చెప్తున్నది. సంవత్సరానికి మూడు వాయి దాల్లో వచ్చే నిధులను సకాలం లో ఇవ్వట్లేదు. ఈ ఏడాది నవంబర్ నెల వచ్చింది. మొదటి విడతలో ఇవ్వాల్సిన నిధులను ఇప్పుడు విడుదల చే శారు. దీనితో మధ్యాహ్న భోజ న కార్మికులు అనేక అవస్థలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. దేశంలో 11 కోట్ల మంది పిల్లలుంటే, 447 స్వచ్ఛంద సంస్థలు 25 శాతం మందిని కవర్ చేస్తున్నాయి. స్వచ్ఛంద సంస్థల ఎంపిక కులమతాలకు అతీతంగా ఉండా లని చట్టం చెప్తుంటే, అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి ధార్మిక సంస్థలకు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నారు. కొన్ని చోట్ల హెడ్కుక్ దళితులు అయితే, మరో కులానికి చెందిన హెల్పర్‌తో వంట చేయిస్తూ కులవివక్ష పాటిస్తున్నారు. ఇవన్నీ పైకి కనిపిం చని కారణాలు. ఆహార భద్రతా చట్టం ప్రకారం మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వాలు గుర్తించి, ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేసి, కనీస వేతనాలు ఇవ్వాలి. దానికి నిధుల కోసం సంపన్నులపై సంక్షేమ పన్ను విధించాలి''.
హక్కుల కోసం ఉద్యమించాలి : చుక్క రాములు
కార్మికుల హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆహ్వాన సంఘం వైస్ చైర్మెన్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన పథకం పేద పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పథకాలకు సరిపోయినన్ని నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ఎక్కువ నిధులుకేటాయిస్తేనే ప్రజలకు ప్రయోజనకరమని అన్నారు. పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఎక్కువ పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అఖిల భారత మిడ్డేమీల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షురాలు ఎస్ వరలక్ష్మి మాట్లాడుతూ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత విధిస్తున్నదని విమర్శించారు. పెట్రోల్, గ్యాస్ వంటి ధరల పెరుగుదలతో కార్మికులు, ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. మిడ్డేమీల్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రమ మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వెయ్యి పారితోషికం ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రూ.రెండువేలకు పెంచుతామంటూ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ పథకానికి నగదు బదిలీని తేవడాన్ని తీవ్రంగా ఖండించారు.
పారితోషికం రూ.రెండు వేలు పెంచాలనీ, ఇతర సమస్యలను పరిష్కరించాలంటూ దశలవారీ పోరాటాలు చేస్తామనీ, అవసరమైతే ఫిబ్రవరిలో సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి, అంగన్వాడీ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ఉషా, ఆశా వర్కర్ల ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సురేఖ, మిడ్డేమీల్ ఫెడరేషన్ జాతీయ నాయకులు స్వరూపరాణి తదితరులు పాల్గొన్నారు.
అధిక నిధులు కేటాయించాలి : నర్సిరెడ్డి
మధ్యాహ్న భోజన పథకానికి అధిక నిధులు కేటాయించాలని అఖిల భారత మీడ్డేమీల్ వర్కర్స్ ఫెడరేషన్ జాతీయ మహాసభల ఆహ్వానసంఘం చైర్మెన్, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో 11.70 లక్షల పాఠశాలల్లో 12 లక్షల మంది పిల్లలకు ఈ పథకం అందుతున్నదని వివరించారు. ఆ పథకం ద్వారా భోజనం వృధా కావడం లేదనీ, అవినీతికి చోటు లేదనీ, 200 శాతం విజయవంతంగా అమలవుతున్నదని చెప్పారు. దేశంలో 39 శాతం మంది పిల్లలు పౌష్టికాహారం లేక బాధపడుతున్నారని వివరించారు. మత సామరస్యానికీ, గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక హైదరాబాద్ అని అన్నారు. అయితే బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనీ, శాంతి సామరస్యానికి విఘాతం కల్పిస్తున్నదని విమర్శించారు. వాటికి చోటివ్వకూడదని ఆయన పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. కార్మికులకు కనీస వేతనాలను ఇవ్వాలని చెప్పారు. కేంద్రీకృత కిచెన్ షెడ్లలో వండడం వల్ల హైదరాబాద్‌లో 20 నుంచి 30 శాతం మంది పిల్లలే భోజనం తింటున్నారని వివరించారు. కానీ కార్మికులు ఆ పాఠశాలలోనే వంట చేయడం వల్ల 95 నుంచి వంద శాతం పిల్లలు భోజనం చేస్తున్నారని అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు, ఎన్జీవోలకు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు.