Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి : సీఎస్ సోమేశ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రధాని మోడీ ఈ నెల 12న రాష్ట్రానికి రానున్నారు. ఆ సందర్భంగా ఆయన రామగుండంలో పర్యటించనున్నారు. ప్రధాని రాకను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. గురువారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో సీఎస్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీపీ మహేందర్ రెడ్డి, దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్, రామగుండం ఫర్టిలైజర్ ఫాక్టరీ సీఈఓ ఏకె జైన్ తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రధాని పర్యటన ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వేదికల వద్ద తగిన బందోబస్తు, శాంతి భద్రతలు, తదితర ఏర్పాట్లను బ్లూబుక్ ప్రకారం చేయాలన్నారు.