Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దర్యాప్తు వాయిదా ఉత్తర్వుల పొడిగింపు
- నిందితుల నేరాలకు ఆధారాలు ఉన్నాయన్న ప్రభుత్వం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డబ్బుతో కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసును సీబీఐకి అప్పగించాలని నిందితులు దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా పడింది. అప్పటి వరకు దర్యాప్తును వాయిదా వేయాలని గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు జస్టిస్ బి.విజరుసేన్రెడ్డి ప్రకటించారు. దర్యాప్తును వాయిదా ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం చేసిన వినతిని తోసిపుచ్చారు. నిందితులను కస్టడీలోకి తీసుకునేందుకు ఆ ఉత్తర్వులు అవరోధంగా ఉన్నాయని ప్రభుత్వం చెప్పగా, ఈ నెల 7న విచారణలో ఆ విషయాలను తేల్చుతామని హైకోర్టు ప్రకటించింది. ఎమ్మెల్యేల ఎర కేసు దర్యాప్తు సీబీఐ లేదా సిట్లకు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి దాఖలు చేసిన రిట్ పిటిషన్ను శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ఇదే సమయంలో ఎర కేసు నిందితులు రామచంద్రభారతి, నంద కుమార్, సింహయాజిలు కూడా సీబీఐ దర్యాప్తు కోరుతూ శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే తరహాలో నందు సతీమణి చిత్రలేఖ కూడా పిటిషన్ దాఖలు చేశారు. తీన్మార్ మల్లన్న కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నింటినీ 7న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఇదిలా ఉండగా, ఈ కేసుల్ని వ్యతిరేకరిస్తూ ప్రభుత్వం 200 పేజీలకుపైగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నాలకు ఆధారాలు ఉన్నాయనీ, బీజేపీలో చేరాలని కూడా నిందితులు కోరారనీ, ఈ వ్యాజ్యాలను కొట్టేయాలని ప్రభుత్వం కోరింది. సమగ్ర కౌంటర్ పిటిషన్ను లోతుగా పరిశీలన చేసి తమ వాదనలు చెప్పేందుకు గడువు కావాలని ప్రేమేందర్రెడ్డి న్యాయవాది కోరారు. విచారణ 7న జరుగుతుంది.మెయినాబాద్ పీఎస్లో నమోదైన కేసు దర్యాప్తును నిలిపివేయాలని గతంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే.