Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జోడో యాత్రకు తరలిరావాలి
- కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపు
- జిల్లా నాయకులతో కలిసి రూట్ మ్యాప్, సభ ఏర్పాట్లు పరిశీలన
నవతెలంగాణ-మద్నూర్
రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్రలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆది, సోమవారాల్లో (6వ, 7వ తేదీ) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్, పెద్దకొడప్గల్, మద్నూర్‌లో కొనసాగనున్న జోడో యాత్ర రూట్ మ్యాప్‌ను, మద్నూర్ మండలం మేనూర్‌లో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లను నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దు నుంచి మహారాష్ట్రకు వెళ్లే యాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ జోడో యాత్ర విజయవంతం చేయాలని జుక్కల్ నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే సౌదాగర్ గంగారామ్‌కు సూచించారు. పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తా, నాయకులు హాజరుకావాలని సూచించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జి మాణికం ఠాకూర్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే గంగారం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కైలాస్ శ్రీనివాస్, ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు స్థానిక నియోజకవర్గ నాయకులు మండల నాయకులు తదితరులున్నారు.