Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హాస్టల్ కేటాయించాలంటూ కోరుతూ ఆందోళన చేసిన నిజాం కళాశాల విద్యార్ధులపై పోలీసులు చేసిన దాడిని భారత విద్యార్ధి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కళాశాల క్యాంపస్‌లోకి పోలీసులు ప్రవేశించి శాంతియుతంగా ఆందో ళన చేస్తున్న విద్యార్ధులపై ముఖ్యంగా అమ్మాయిలపై విచక్షణా రహితంగా పోలీసులు దాడి చేయడం దుర్మార్గమని విమర్శించారు.
ప్రజాస్వామ్యయు తంగా ఆందోళన చేస్తున్న విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయకుండా కళా శాల అధికారులు విద్యార్థులను అరెస్ట్ చేయించడం సిగ్గుచేటని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన విద్యార్థులను తక్షణమే విడుదల చేయాలనీ, వారి సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.