Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపాధి కల్పనలో మోడీ సర్కారు విఫలం
- పోస్టర్ ఆవిష్కరణలో ఏఐవైఎఫ్ నేతల విమర్శ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విద్య, ఉపాధి హక్కుల సాధన కోసం ఈనెల 25న ''పార్లమెంట్ మార్చ్''ను నిర్వహించనున్నట్టు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర పిలుపునిచ్చారు. శనివారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ఉన్న అమృతా ఎస్టేట్స్‌లో సంబంధిత పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధి అవకాశాలను కల్పించడంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విఫలమైందని వారు విమర్శించారు. కార్పొరేట్ అనుకూల విధానాలతో దేశాన్ని పాలిస్తూ యువతను గాలికొదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుపరం చేసిందనీ, ఇతర పరిశ్రమలను మూసేసిందనీ, దీంతో కోట్లాది మంది యువత ఉపాధిని కోల్పో యిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ హామీ ఇచ్చిరదని గుర్తు చేశారు. ఆ హామీని ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనీ, భగత్‌సింగ్ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలనీ, నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్లు సురేష్, శంకర్, లింగం రవి, యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ బాలకృష్ణ, సత్యప్రసాద్, లక్ష్మణ్, రామకృష్ణ, శ్రీనివాస్, మానస్ కుమార్, మహేందర్, మొగిలి లక్ష్మణ్, మహేష్, శ్రీనాథ్‌రెడ్డి, భూక్య రామకృష్ణ, సూర్య, రాజ్ కుమార్, విజరు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.