Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 నుంచి బీఎడ్ తరగతులు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఎడ్ కోర్సులో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎడ్‌సెట్ తొలివిడత కౌన్సెలింగ్‌లో 10,053 మందికి సీట్లు కేటాయించినట్టు ఎడ్‌సెట్ ప్రవేశాల కన్వీనర్ పి రమేష్‌బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కోర్సులో కన్వీనర్ కోటాలో 14,285 సీట్లున్నాయని పేర్కొన్నారు. అయితే 16,664 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేశారని పేర్కొన్నారు. వారిలో 10,053 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు జాయినింగ్ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 11 వరకు ఫీజును చలానా ద్వారా చెల్లించి కాలేజీల్లో చేరాలని కోరారు. ఈనెల 14 నుంచి బీఎడ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.