Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 ఏండ్ల తర్వాత ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
తెలంగాణ ఉద్యమ సమయంలో చేపట్టిన సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవు (ఈఎల్స్)గా మంజూరు చేస్తూ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 2011 సెప్టెంబర్ 19 నుంచి 2011 అక్టోబర్ 17వ తేదీ వరకు ఆర్టీసీ కార్మికులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. సుదీర్ఘకాలంగా కార్మిక సంఘాలు సకల జనుల సమ్మె కాలాన్ని వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దాదాపు 11 ఏండ్ల తర్వాత ఇప్పుడు సమ్మె కాలాన్ని ఈఎల్స్గా గుర్తిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. కార్మికుల సర్వీస్ రిజిస్టర్లో ఈ మేరకు ఈఎల్స్ను నమోదు చేస్తారు. 2011 సెప్టెంబర్ 19 నుంచి 2018 జులై 26 మధ్య రిటైర్డ్ అయిన, మరణించిన కార్మికుల వివరాలు, ఆడిట్ లెక్కలు పూర్తిచేసుకోవాలనీ, వారికి ఎప్పుడు చెల్లింపులు చేయాలనేది తర్వాత నిర్ణయిస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ టెర్మినల్ లీవ్ బెనిఫిట్స్ ఈనెల 21వ తేదీ తర్వాత నుంచి వర్తిస్తాయి.