Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఖ్యఅతిధిగా ప్రధాని మోడీ
- మునుగోడులో విజయం మాదే
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధాని మోడీ ముఖ్యఅతిధిగా ఈనెల 12న రామగుండంలో నిర్వహించబోయే బహిరంగసభకు భారీ జనసమీకరణ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇదే అంశంపై ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నేతలతో ఆయన శనివారం హైదరాబాద్‌లో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ సభకు రైతులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మునుగోడులో భారీగా అధికార దుర్వినియోగం జరిగిందన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా పోలీస్ కమిషనర్, సీఈసీ, ఎస్పీ పనిచేశారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు పెట్టారని చెప్పారు. అయినా మునుగోడులో తమపార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, నాయకులు జి వివేక్, జి విజయరామారావు, సుద్దాల దేవయ్య, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, గంగిడి మనోహర్‌రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.