Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పివి శ్రీహరి ఒక ప్రకటన విడుదల చేశారు. ఓపెన్ పదో తరగతి పరీక్షలకు 10,930 మంది హాజరుకాగా, 4,977 (45.44 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని వివరించారు. ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 12,113 మంది రాస్తే 4,896 (40.42 శాతం) మంది పాసయ్యారని తెలిపారు. మార్కుల మెమోలను 15 రోజుల్లో సంబంధిత విద్యాసంస్థలకు పంపిస్తామని పేర్కొ న్నారు.విద్యార్థులు మెమోలను www.telanganaopenschool. org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటిలో ఏమైనా అభ్యంతరాలుంటే ఈనెల 29 వరకు డీఈవోలు, కోఆర్డినేటర్ల ద్వారా టాస్ డైరెక్టర్ కార్యాలయానికి పంపించాలని కోరారు. ఈనెల 10 నుంచి 21 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.