Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ నేత ఈటల ఎద్దేవా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇతర పార్టీల గుర్తులపై గెలిచిన వారికి మంత్రి పదవులు ఇచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఆపార్టీ సీనియర్ నేత ఈటల రాజేందర్ అన్నారు. ఇద ేక్కడి ప్రజాస్వామ్యమని నిలదీశారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు తుంటే విడ్డూరంగా ఉందని అన్నారు. దేశం అధోగతి పాలవు తుం ఓదంటూ ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శిం చారు. ఆయన వ్యక్తం చేసిన అదే బాధను తెలంగాణలో తాము అనుభవిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రజాస్వా మ్యాన్ని పూర్తిగా ఖూనీ చేశారని చేప్పారు. లక్షలాది మంది ఉద్య మంలో పాల్గొని, వేల మంది ప్రాణాలు అర్పిస్తే రాష్ట్రం ఏర్పాటైం దన్నారు. 'టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆణిముత్యాలు అవుతారో' చెప్పాలని కోరారు. కేసీఆర్ రాసిన స్క్రిప్ట్‌ను కొన్ని ప్రసార మాధ్యమాలు పనిగట్టుకుని చూపిస్తున్నాయని విమర్శించారు. మునుగోడులో నైతికంగా కేసీఆర్ ఓడిపోయారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలవడం ఖాయం'' అని ఈటల తేల్చి చెప్పారు.