Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేష్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికతో ప్రధాన పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్న వైనం బట్టబయలైందని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ దాసు సురేష్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓ ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం ప్రయత్నిస్తామని చెప్పారు. సైద్ధాంతిక సానుకూలత ఉన్నందువల్లే అక్కడ బీయస్పీ అభ్యర్థి శంకరాచారికి మద్ధతిచ్చామని తెలిపారు. శనివారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలో రాజ్యాధికార సమితి కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నిక అత్యంత అప్రజాస్వామిక పద్ధతిలో జరిగిందన్నారు. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నికల కమిషన్, పోలీసులు నైతిక భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రధాన పార్టీలన్ని డబ్బును, మద్యాన్ని విచ్చలవిడిగా పంపిణీ చేసి ఎన్నికల వ్యవస్థను దిగజార్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో భవిష్యత్తులో సామాన్యుడు ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్న భయపడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.