Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కార్తీకమాసం, శబరిమల యాత్ర సహా వివిధ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సుల్ని కాంట్రాక్ట్‌కు తీసుకుంటే 10 శాతం డిస్కంటు ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు శనివారం ఆ సంస్థ ఈడీ ఆపరేషన్స్ సర్క్యులర్ జారీ చేశారు. బస్ ఆన్ కాంట్రాక్ట్ స్కీంను ఈ ఏడాది జులై 8 నుంచి సెప్టెంబర్ 30 వరకు నిర్వహించి 15 నుంచి 20 శాతం డిస్కౌంట్లు ఇచ్చారు. అయితే కార్తీకమాసం ప్రారంభం కావడంతో యాత్రీకులు వేములవాడ, కాళేశ్వరం, శ్రీశైలం, కీసరగుట్ట తదితర ప్రాంతాలకు సమూహాలుగా వెళ్తారనీ, దానితోపాటు శబరిమలకు వెళ్లే యాత్రీకులు కూడా అధికంగా ఉంటుండటంతో నవంబర్ 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు స్కీంను 10 శాతం డిస్కౌంట్‌తో పొడిగిస్తున్నట్టు తెలిపారు. శబరిమల యాత్రీకులు 2023 ఫిబ్రవరి 28వ తేదీ వరకు డిసెంబర్ 31 లోపు ముందస్తుగా బస్సుల్ని కాంట్రాక్ట్‌కు తీసుకోవచ్చు.