Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ సంచాలకులకు మంత్రి సబిత ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నారాయణ్‌ఖేడ్‌లోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో అల్పాహారం వికటించి 35 మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన సంఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి పాఠశాల విద్యాశాఖ సంచాలకులను ఆదేశించారు. ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థులు చికిత్స పొందుతున్న నారాయణ్‌ఖేడ్ ప్రాంతీయ ఆస్పత్రికి వెళ్లి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలంటూ జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో)ని శనివారం ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. విద్యార్థులందరూ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యేంత వరకు ఆ ఆస్పత్రిలోనే ఉండి పర్యవేక్షించాలని డీఈవోని ఆదేశించారు.