Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు కె లక్ష్మణ్ స్వాగతించారు. ఈ నిర్ణయం అణగారిన వర్గాల సాధికారతకు దోహదపడుతుందని శనివారం ఒక ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లక్షిత వర్గాలకు చేరాలన్న కేంద్ర ప్రభుత్వ విధానానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉందని పేర్కొన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల దేశంలోని ప్రయివేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు కాలేదని తెలిపారు. ఆయా వర్సిటీల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయాలన్న యూజీసీ నిర్ణయంతో అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చే చారిత్రాత్మక నిర్ణయమని వివరించారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, యూజీసీకి ధన్యవాదాలు తెలిపారు.