Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిక్కి లోగో ఆవిష్కరణ
నవ తెలంగాణ - బిజినెస్ బ్యూరో
సామాన్య ప్రజలను, వెనుకబడిన వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ (బిక్కి)ని ఏర్పాటు చేశామని ఆ సంస్థ అధ్యక్షులు చేరాల నారాయణ తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా అండగ నిలువాలని నిర్దేశించుకు న్నామన్నారు. శనివారం హైదరాబాద్లో జరిగిన బిక్కి సంస్థ స్థాపన, లోగో ఆవిష్కరణకు సీనియర్ ఐఎఎస్ అధికారి పరికిపండ్ల నరహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, ఎంఎస్ఎంఇల స్థాపన, సబ్సీడీలు, రుణాలను యువత అందిపుచ్చుకోవాలని నరహరి సూచించారు. ఈ సమావేశంలో బిక్కి సెక్రటరీ కిరణ్ దాసరి, బిక్కి ప్రతినిధులు పాల్గొన్నారు.