Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - బిజినెస్ బ్యూరో
కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసొసియేషన్స్ ఆఫ్ ఇండియా తన 12వ క్రెడారు హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది. నవంబర్ 5, 6వ తేదిల్లో జరగనున్న ఈ ప్రదర్శనను శనివారం కొంపల్లిలోని ఆస్పిసియస్ కన్వెన్షన్ సెంటర్లో లాంచనంగా ప్రారంభించింది. డెవలపర్లు, కొనుగోలుదారులు అందరినీ ఒకే చోటకు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఉత్తర హైదరాబాద్‌పై దష్టి సారించి నిర్వహిస్తోన్న తొలి ప్రాపర్టీ షో అని పేర్కొంది. ఈ ప్రదర్శనను తెలంగాణా రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి, రహాదారుల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి నియోజకవర్గ ఎంఎల్ఎ మైనంపల్లి హనుమంత రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఎంఎల్ఎ కెపి వివేకానంద, మేడ్చల్ ఎంఎల్‌సి శంబీపూర్ రాజుతో పాటుగా క్రెడారు హైదరాబాద్ అధ్యక్షులు పి రామ కష్ణారావు, జనరల్ సెక్రటరీ వి రాజశేఖర్ రెడ్డి, క్రెడారు తెలంగాణా ఛైర్మన్ సిహెచ్ రామచంద్రా రెడ్డి, అధ్యక్షులు డి మురళి కష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ''నగర వ్యాప్తంగా జరుగుతున్న అభివద్థితో పాటుగా పరిశ్రమలు అభివద్ధి చెందుతున్న తీరు కారణంగా గహ, వాణిజ్య రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ కూడా గణనీయంగా పెరిగింది. ఈ ప్రోపర్టీ షోను అత్యుత్తమ, అత్యంత విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్, మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఉత్తర ప్రాంతంపై దష్టి సారించి చేస్తుంది. ఈ ప్రోపర్టీ షోలో అత్యుత్తమ ప్రాజెక్ట్‌లు ఉంటాయి.'' అని రామకృష్ణా రావు పేర్కొన్నారు.