Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
జేఎన్జే హౌసింగ్ సొసైటీలోని డైరెక్టర్ స్థానానికి శనివారం జరిగిన ఎన్నికల్లో ఎన్. వంశీ శ్రీనివాస్ విజయం సాధించారు. జేఎన్జే హౌసింగ్ సొసైటీకి సీఇఓగా వంశీ శ్రీనివాస్ ఉన్నారు. ఆయనకు సంబంధించి డైరెక్టర్ పదవీకాలం ఈ నెల మూడో తేదీతో ముగిసింది.
ఆ స్థానానికి శనివారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ఎన్నికలు జరిగాయి. వంశీ శ్రీనివాస్‌తో పాటు ఉదరు, రమేశ్‌బాబు పోటీ చేశారు. 859 ఓట్లు పోల్ అయ్యాయి. అందులో రెండు ఓట్లు చెల్లుబాటు కాలేదు. వంశీశ్రీనివాస్కు 596 ఓట్లు, ఉదరుకు 255 ఓట్లు, రమేశ్‌బాబుకు ఆరు ఓట్లు పడ్డాయి. 351 ఓట్ల మెజారిటీతో వంశీశ్రీనివాస్ గెలుపొందినట్టు కో ఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఎన్నికల అధికారి ఎ. వెంకట్‌రెడ్డి తెలిపారు. ఎన్నికలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగాయి. ఈ సందర్భంగా సొసైటీ జనరల్‌బాడీ కూడా జరిగింది. వంశీకి సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు. సొసైటీలో ఉన్న సభ్యులందరి ఆకాంక్షను త్వరగా నెరవెర్చేలా కృషి చేస్తానని వంశీ శ్రీనివాస్ తెలియజేశారు.