Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు పోరాటానికి రెండేండ్లు
- నవంబర్ 26 న చలో రాజ్‌భవన్
- జయప్రదానికి ఎస్కేఎం పిలుపు
- పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైెతాంగ ఉద్యమానికి తలొగ్గిన మోడీ సర్కార్ తమ డిమాండ్ల పరిష్కారానికి హామీనిచ్చిందనీ, అయితే వాటిని అమలు చేయటంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) నాయకులు విమర్శించారు. శనివారం హైద్రాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఎస్కేఎం నాయకులు టి.సాగర్, పశ్య పద్మ, ఉపేందర్‌రెడ్డి, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, మూడ్ శోభన్, సోమిడి శ్రీను, వరికుప్పల వెంకన్న, పెద్దారపు రమేష్ తదితరులు ఛలో రాజ్‌భవన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైౖతు పోరాటానికి రెండేండ్లు పూర్తి కావొస్తున్న సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 26న 'చలో రాజ్ భవన్'ను కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతాం గానికి రాతపూర్వకంగా హామీనిచ్చి అమలు చేయకపోవటం దారుణ మని విమర్శించారు. పండించిన పంటలకు కనీస మద్ధతు ధరల కోసం పార్ల మెంటులో చట్టం చేయాలనీ, స్వామినాథన్ సిఫార్సుల అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఉన్న రుణాలన్నింటినీ ఏకకాలంలో మాఫీ చేయాలన్నారు. రుణ విమోచన చట్టం తేవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించు కోవాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని సవరించి అమలు చేయాలని కోరారు. రైతు ఉద్యమంలో మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర హౌంశాఖా సహాయ మంత్రి అజరుకుమార్ మిశ్రాను మంత్రివర్గం నుంచి తొలగించాలన్నారు. అటవీ సంరక్షణ చట్టం నిబంధనల్లో కేంద్రం చేస్తున్న మార్పులను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు.