Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అక్రమ ఓట్లను అరికట్టాలి :సీఈవోకు సీసీఎస్ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్- రంగారెడ్డి -హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమంగా నమోదైన ఓట్లను అరికట్టాలని సీపీయస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఓటర్ల నమోదు గడువు తేదీని పొడిగించాలని కోరింది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ను శనివారం హైదరా బాద్‌లో ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్‌గౌడ్ ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ మందకోడిగా సాగుతున్న నేపథ్యంలో ఉన్నత పాఠశాలల్లో ఉన్న టీచర్లందరికీ ఓటర్ల నమోదు చివరి రోజైన ఈనెల ఏడున ఓడీ సౌకర్యం కల్పించాలని సూచించారు.
రాష్ట్ర సరిహద్దు జిల్లాలైన నారా యణపేట్, జోగులాంబ గద్వాల్లో పనిచేస్తూ పక్క రాష్ట్రంలో నివాసముం టున్న వారి ఆధార్ నివాస ప్రాంతాల ఆధారంగా కాకుండా ఉద్యోగం చేసే సంస్థ ఆధారంగా ఓటు నమోదుకు అవకాశమి వ్వాలని తెలిపారు. నిబంధన లకు విరుద్ధంగా ప్రయివేటు, కార్పొరేట్ సంస్థల నుంచి నమోదవుతున్న అక్రమ ఓటర్లను అరికట్టాలనీ, అందుకు బాధ్యులైన అధికారులకు సరైన మార్గదర్శకాలివ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలను పరిశీలించి ఆదేశాలు జారీ చేస్తామంటూ వికాస్‌రాజ్ హామీ ఇచ్చారని వివరించారు. కార్యక్రమంలో సీపీఎస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రవణ్ కుమార్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.