Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్
- నిజామాబాద్లో నవతెలంగాణ పుస్తక ప్రదర్శన ప్రారంభం
నవతెలంగాణ-నిజామాబాద్ సిటీ
ప్రజలు పుస్తక పఠనంతో విజ్ఞాన సముపార్జన చేసుకోవాలని ఆర్టీసీ చైర్మెన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. నవతెలంగాణ బుకహేౌస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆర్టీసీ ఆర్ఎం ఉషాదేవి, మేయర్ దండు నీతు కిరణ్తో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో బుక్ స్టాల్ ఏర్పాటు చేయడంపై నవతెలంగాణ పబ్లిషింగ్హౌస్ బాధ్యులను అభినందించారు. ఈ బుక్ స్టాల్ ప్రజల ఆదరణ చూరగొని మంచిగా నడిస్తే.. దుకాణ కేటాయింపు కాలపరిమితి పొడిగిస్తామని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో ఈ బుక్ స్టాల్ ఏర్పాటు చేయడం వల్ల సాహిత్య ప్రియులకు, పుస్తక పాఠకులకు మంచి అవకాశం లభించిందని చెప్పారు. ప్రజలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. పుస్తక ప్రదర్శనశాలలోని పుస్తకాలను పరిశీలించారు. ఇక్కడ చూస్తుంటే అన్ని రకాల పుస్తకాలు చదవాలనిపిస్తున్నట్టు తెలిపారు.
పోటీ పరీక్షలతో పాటు చారిత్రక, నవలలు, కథల పుస్తకాలు, చిన్న పిల్లలు మొదలు.. యవతకు, పెద్దవారికి ఇలా అందరికీ ఉపయోగపడే పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని బుకహేౌస్ జనరల్ మేనేజర్ వాసు తెలిపారు. పుస్తక మిత్ర కార్డు తీసుకుంటే 20 నుంచి 30 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. బస్టాండ్లో పుస్తక ప్రదర్శనను సాహితీవేత్తలు, పుస్తక ప్రియులు సందర్శించి ఆదరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఆర్థిక ప్రాణాళిక సంఘం సభ్యులు బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మెన్ సాంబారి మోహన్, ఆర్టీసీ ఆర్ఎం ఉషాదేవి, నిజామాబాద్ 1, 2 డిపో మేనేజర్లు, ఇందల్వాయి ఎంపీపీ బదావత్ రమేశ్ నాయక్, బుకహేౌజ్ మేనేజర్ కృష్ణారెడ్డి, నవతెలంగాణ రీజియన్ మేనేజర్ సురేశ్, స్టాఫర్ భాస్కర్, బుకహేౌస్ బ్రాంచ్ ఇన్చార్జి సత్యం తదితరులు పాల్గొన్నారు.