Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో హైదరాబాద్
ఉన్నతాధికారి కాండ్రేగుల జీవితంలో పాటించిన విలువల్ని అందరూ ఆచరించాలని పలువురు సూచించారు. ఆదివారం ఎస్.ఎస్.ఆర్.శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆద్వర్యలో కాండ్రేగుల నాగేశ్వర్రావు నాలుగో వర్థంతి సభను కమర్షియల్ టాక్సెస్ అడిషనల్ కమిషనర్ సంధానకర్తగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి సమస్యను చిరునవ్వుతో పరిష్కరించుకోవచ్చని కాండ్రేగుల పదే పదే చెప్పేవారని గుర్తుచేశారు. కమర్షియల్ ట్యాక్స్‌లో మంచి నాయకత్వం కలిగిన అధికారిగా పని చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాండ్రేగుల కుటుంబ సభ్యులు, మిత్రులతో పాటు ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.