Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(టీపీయూఎస్) రాష్ట్ర ఎన్నికలు హైదరాబాదులోని స్టాన్లీ ఇంజినీరింగ్ కళాశాల, అబిడ్స్‌లో నిర్వహించారు. 2022- 2025 వరకు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిగా హనుమంతరావు నవాత్ సురేష్ తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి పాలేటి వెంకట్రావు, సహా అధికారి సూరం విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర సహాధ్యక్షులు ఏ. నరేందర్‌రావు, ఏ. పాపిరెడ్డి, బి. ఉషారాణిలు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బండి రమేష్, టి.పెంటయ్య, రామకష్ణారెడ్డిలు, కోశాధికారిగా లక్ష్మీ కాంతారావు ఎన్నికైనట్టు వారు తెలిపారు.అనంతరం ఉపాధ్యాయ సమస్యలపై పలు తీర్మానాలు చేశారు.