Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాజ్యసభ సభ్యులు పేద గిరిజన విద్యార్థికి ఆపన్న హస్తం అందించారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీ లో సీటు సాధించిన గణేష్ కాలేజీ, హాస్టల్ ఫీజుల కోసం రూ.1,48,000 సాయమందించారు. ఎంపీ రవిచంద్ర స్వగ్రామం ఇనుగుర్తికి పక్కనే ఉన్న వీరారె డ్డి పల్లికి చెందిన బదావత్ భోజ్య కుమారుడు గణేష్ మొదట్నుంచి చదువులోచురుగ్గా ఉండేవాడు. మహ బూబ్ నగర్‌లోని గిరిజన గురుకులంలో ఇంటర్ పూర్తి చేసి జాతీయ స్థాయిలో జరిగిన నీట్ పోటీ పరీక్షల్లో 600 మార్కులకు గాను 496 మార్కులు సాధించారు.మెడికల్ కౌన్సిలింగ్లో నిజామాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు గణేష్‌కు కేటాయించారు. ఈ సందర్భంగా గణేష్ కు టుంబ సభ్యులు వద్ది రాజుకు కృతజ్ఞతలు తెలిపారు.