Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
మునుగోడు ఉప ఎన్నికలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు మద్దతు తెలిపారనీ, అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి విజయం వెనుక ఆర్టీసీ కార్మికులు, వారి కుటుంబసభ్యుల సహాకారం ఉన్నదని మునుగోడు ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య చైర్మెన్ కే రాజిరెడ్డి తెలిపారు. ఎన్నికలకు ముందు ఆర్టీసీ కార్మికుల కొన్ని సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించిందనీ, తమకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతించాలని కోరారు. ఆదివారంనాడాయన నివాసంలో సమాఖ్య కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేస్కేలు, పెండింగ్ సమస్యల్ని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. సమావేశంలో సమాఖ్య నాయకులు పి.క్రిష్ణయ్య, బీజేఎమ్ రెడ్డి, ఎమ్వీ చారి తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయం అనంతరం హయత్నగర్ 1,2 డిపోల వద్ద సమాఖ్య కార్మికులు బాణసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు.