Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవయవదానంపై ప్రతిజ్ఞ
హైదరాబాద్ : శ్రీచైతన్య విద్యాసంస్థలు, ఎన్టీఆర్ ట్రస్ట్, జీవన్‌దాన్, మెడికవర్ హాస్పిటల్స్ సంయుక్తంగా రక్తదాన, అవయవదాన కార్యక్రమం చేపట్టాయి. ఆదివారం మియాపూర్ శ్రీచైతన్య ఫ్యూచర్పాత్వే స్కూల్లో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి సి.హెచ్.మల్లారెడ్డి, తెలంగాణ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, శ్రీచైతన్య విద్యా సంస్థల కో-ఫౌండర్ డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నారు. డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టగా,పలువురు హాజరై ఆమె సేవా కార్యక్రమాన్ని కొనియాడారు.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శ్రీచైతన్య అధ్యాపక, ఇతర సిబ్బంది వేలాదిమంది సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. 1850మంది రక్తదానం చేయగా,అనేకమంది అవయవదాన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా అకడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ, ''డాక్టర్ ఝాన్సీ లక్ష్మీబాయి జన్మదినోత్సవ వేడక పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.ఆపదలో ఉన్నవారికి రక్తం, అవయవం ఎంత అవసరసమో మనందరికీ తెలుసునని,ఈ సేవా కార్యక్రమం కొంతమందికైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.