Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వారి సాంస్కృతిక వేడుకలు
హైదరాబాద్ : సౌత్ ఇండియా కల్చరల్ అసోసియేషన్ (ఎస్ఐసీఏ) 64వ వార్షిక కళా ఉత్సవం-2022 ఆహుతుల్ని అలరిస్తోంది. గత ఆరు రోజులుగా నిర్వహిస్తున్న సాంస్కృతిక ఉత్సవాలు ఎంతోమందిని అలరించాయి. వార్షికోత్సవ ముగింపు వేడుకల సందర్భంగా సునిల్ ఆర్ గార్గేయ బృందం చేసిన ప్రదర్శన ఆహుతుల్ని కట్టిపడేసింది. గార్గేయ బృందాన్ని, కార్యక్రమాలకు ఎంతో విలువైన సాంకేతిక సహకారాన్ని అందించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, హోప్ అడ్వర్టయిజింగ్ లిమిటెడ్ డైరెక్టర్ ఎస్.రావును విజ్ఞానసమితి రెసిడెంట్స్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ ఎన్.రాజశేఖర్, జాయింట్ సెక్రటరీ వి.రమణ, కె.ఎన్.డి.మూర్తి, ట్రెజరర్స్ ఇతర సభ్యులు పాల్గొన్నారు.