Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చైర్మెన్‌గా మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ (టీయుఎంహెచ్‌ఇయూ, సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర మహాసభల కోసం ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు.. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సమావేశానికి ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదా నాయక్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్, హైదరాబాద్ సౌత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మీనా, శ్రావణ్ కుమార్, యూనియన్ రాష్ట్ర నాయకులు హరిశంకర్, కవిత, కిరణ్మయి, ఆరోగ్య మిత్ర రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య పాల్గొని ప్రసంగించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆహ్వాన సంఘానికి మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ చైర్మన్‌గా, కె.యాద నాయక్ ప్రధాన కార్యదర్శిగా, శ్రావణ్ కుమార్ కోశాధికారిగా, చీఫ్ ఫ్యాట్రన్లుగా జె. వెంకటేష్, భూపాల్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు గా హరిశంకర్, కవిత కిరణ్మయి, కె.బలరాం ఎం.డి ఫసియుద్దీన్, సుధాకర్, సంజు జార్జ్, వి విజయ వర్ధన్ రాజు, 108 వెంకన్న, సుగుణ కొండలరావు, కుమారస్వామి, వేణుగోపాల్, ప్రమీల నవీన్, యాదగిరి, షాదుల్లా తదితరులున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ నవంబర్ 27న ఆదివారం రాష్ట్ర మూడో మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్యారోగ్య రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రధానంగా రెగ్యులరైజేషన్, ఇతర జీతభత్యాల సమస్యలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ మహాసభల సందర్భంగా వాటిపైన తీర్మానాలు చేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని అందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కరోనా కాలంలో పని చేసిన వారికి కనీసం ఇన్సెంటివ్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.