Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల డిమాండ్ చేస్తూ రాస్తారోకో
నవతెలంగాణ-లింగంపేట్
తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లి చౌరస్తా వద్ద ఎల్లారెడ్డి-కామారెడ్డి ప్రధాన రహదారిపై ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం తూకం వేసి 15 రోజులు అవుతున్నా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించలేదని దాంతో కుప్పల వద్ద కాపలా ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరగంటపాటు రైతుల రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి. సమాచారం అందుకున్న లింగంపేట్ సొసైటీ చైర్మెన్ దేవేందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. లారీలను కేటాయించకపోవడం వల్ల ఆలస్యం జరిగిందని, రెండు రోజలు వ్యవధిలో తూకం వేసిన ధాన్యాన్ని తరలిస్తామని రైతులకు హామీ ఇవ్వడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు.