Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 48 మంది అరెస్టు, నగదు ఇతర వస్తువులు స్వాధీనం
- రామంజపూర్లోని సలీం ఫామ్ హౌస్‌లో ఘటన
నవతెలంగాణ-శంషాబాద్
అర్ధరాత్రి అనుమతులు లేకుండా చట్ట విరుద్ధంగా రౌడీ షీటర్లు నిర్వహిస్తున్న ముజ్రా పార్టీపై విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ జోన్ ఎస్వోటీ పోలీసులు ఆదివారం ఉదయం దాడులు నిర్వహించారు. 48మందిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి విలువైన వస్తువులు, నగదు, మరణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామంజపూర్‌లో జరిగింది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏ. శ్రీధర్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలోని మాజీ రౌడీ షీటర్ బాబా ఖాన్‌కు చెందిన సలీం ఫామ్ హౌస్ మండల పరిధిలోని రామంజపూర్‌లో ఉంది. రాజేంద్రనగర్ జీహెచ్ఎంసీ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లి ఊటపల్లి, రోషన్ కాలనీకి చెందిన షేక్ అజారుద్దీన్, మహమ్మద్ షోయబ్ ఎలక్ట్రిషియన్ గా, హౌటల్లో పనిచేస్తున్న స్టార్ కాలనీకి చెందిన మహమ్మద్ మహబూబ్, సైఫీ కాలనీకి చెందిన యాసీన్ అలీ ఖాన్ డ్రైవర్‌గా, శాలిబండకు చెందిన మహమ్మద్ ముజఫర్ బట్టల దుకాణంలో వర్కర్‌గా పని చేస్తున్నారు. ఇందులో నలుగురు రౌడీషీటర్లు యాసిన్, మహబూబ్, అజార్, సోహైల్ ఉన్నారు. వీరికి మాజీ రౌడీషీటర్ బాబా ఖాన్‌తో ఇటీవల సాన్నిహిత్యం పెరిగింది. దాంతో ఆ రౌడీషీటర్లకు రామంజపూర్లోని తన సలీం ఫామ్‌హౌస్‌ను ముజ్రా పార్టీ చేసుకోవడానికి వారికి ఇచ్చాడు. ఈ ఫామ్‌హౌస్‌లో నగరానికి చెందిన 48 మంది అక్కడికి వచ్చి ముజ్రా పార్టీ చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి శంషాబాద్ జోన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో దాడులు నిర్వహించారు. అక్కడ ఉన్న 48 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో నలుగురు హిజ్రాలు, మహిళలు, పురుషులు ఉన్నారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఓటీ ఏడీసీపీ పి. నారాయణ ఆధ్వర్యంలో పట్టుబడిన వారిని, వస్తువులను నగదు శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. దాంతో పాటు వారి నుంచి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.