Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కృష్ణరాయ్ చటర్జీ, మాలినీమెస్తా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మిడ్డేమీల్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కృష్ణరాయ్ చటర్జీ, మాలినీమెస్తా ఎన్నికయ్యారు. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎమ్డీఎమ్డబ్ల్యూఎఫ్ఐ జాతీయ రెండో మహాసభలు జరిగిన విషయం తెలిసిందే. అందులో 51 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆ కమిటీలో ఆఫీసు బేరర్లు 15 మంది, వర్కింగ్ కమిటీ సభ్యులు 36 మంది ఉన్నారు. కోశాధికారిగా హిమిదేవి(హిమాచల్‌ప్రదేశ్), కార్యదర్శులుగా ఎస్వీరమ(తెలంగాణ), సంజయ్బారీ(అస్సాం), సునిల్నట్టి(పశ్చిమబెంగాల్), సర్భటి ్ట(హర్యానా), డాక్టర్ అశోక్థోరట్(మహారాష్ట్ర), దయా రమాదేవి(ఆంధ్రప్రదేశ్) ఉండనున్నారు. ఉపాధ్యక్షులుగా జైభగవాన్ (సెంటర్), ఎస్.వరలక్ష్మి(కర్నాటక), మౌనికదత్తరాయ్(త్రిపుర), వీపీ కున్నికృష్ణణ్(కేరళ) ఎన్నికయ్యారు. ఒక ఉపాధ్యక్ష, కార్యదర్శి పోస్టులను భర్తీచేయాల్సి ఉంది. వర్కింగ్ కమిటీలో తెలంగాణ నుంచి టి.చక్రపాణి, బాలలక్ష్మి ఉన్నారు.