Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈనెల 12న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా ధికార సంస్థ సభ్య కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి కోరారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధి కార సంస్థల సంయుక్తాధ్వర్యంలో '75 ఏండ్ల స్వతంత్య్ర భారతంలో మాకూ హక్కు' క్యాంపెయిన్‌ను సోమవారం నిర్వ హించారు. దీనికాయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ చైర్మెన్, సెషన్స్ జడ్జి పాపిరెడ్డి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ మాడ్యూల్ క్యాంపు ముఖ్య ఉద్దేశ్యం ప్రతి ఒక్కరికీ ఉచిత న్యాయ సేవ లు అందాలనీ, వీటి గురించి తెలియని వారికి, సామాన్య ప్రజలకి అవగాహన కల్పించాలని చెప్పారు. దీనికి పారా లీగల్ వాలంటీర్లు, న్యాయవాదులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు ప్రధాన భూమిక పోషించాలని చెప్పారు. జాతీయ లోక్ అదాలత్‌పై ప్రజలకు అవగాహన కల్పించా లన్నారు. కార్యక్రమంలో 1వ అదనపు సెషన్స్ జడ్జి కుశాల్, మెట్రోపాలిటన్ న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాధిక జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పలువురు వికలాంగులకు కృత్రియ అవయవాలు అందచేశారు.