Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐడీసీ గ్లోబల్ ప్రెసిడెంట్ డాక్టర్ సెర్గీ డ్వోరియనోవ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భారత్‌లో వ్యాపార, వాణిజ్య సంబంధాలతో పాటు సామాజిక, సాహిత్య రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని ఇంటర్నేషల్ డిప్లొమాటిక్ క్లబ్ గ్లోబల్ ప్రెసిడెంట్ డాక్టర్ సెర్గీ డ్వోరియనోవ్ తెలిపారు. గచ్చీబౌలిలోని లీ మారిడియెన్ హౌటల్లో అంతర్జాతీయ వ్యాపార, వాణిజ్య వర్గాలతో ఏర్పాటైన ది డిప్లమాటిక్ క్లబ్ సౌతిండియా ఛాప్టర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సెర్గీ మాట్లాడుతూ ఈ యుగం యుద్ధాల కోసం కాదనీ, అంతర్జాతీయంగా అన్ని దేశాల మధ్య సోదర భావాన్ని పెరగాల్సిన అవసరం ఉందన్నారు. సౌత్ ఇండియా చాప్టర్ ప్రెసిడెంట్‌గా నూతనంగా ఎన్నికైన డాక్టర్ మూర్తి దేవరభొట్ల, వైస్ ప్రెసిడెంట్ సూర్య గణేష్ వాల్మీకి, కార్యదర్శిగా డాక్టర్ తస్నీమ్ షరీఫ్ మాట్లాడుతూ 1.38 బిలియన్ల జనాభా కలిగిన భారత దేశంలో వ్యవసాయం, పౌల్ట్రీ ఇండిస్టీ, మీట్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, వ్యాక్సినేషన్, టూరిజం రంగాల్లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. నోయిడా ఫిల్మ్‌సిటీ చైర్మన్ డాక్టర్ సందీప్ మార్వ, బ్రిక్స్ ఇంటర్నేషనల్ ఫోరమ్ ఛైర్ పర్సన్ పూర్ణిమా ఆనంద్‌లు మాట్లాడుతూ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో సంస్థ చేస్తున్న ప్రయత్నాలను వివరించారు.ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను సత్కించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజరుమిశ్రా, అడిషనల్ డీజీపీ శ్రీధర్‌రావు, రీజనల్ పాస్ పోర్ట్ అధికారి దాసరి బాలయ్య తదితరులు పాల్గొన్నారు.