Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గురునానక్ కాలేజీకి జేఎన్టీయూహెచ్ ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఏఎఫ్ఆర్సీ నిర్ణయించిన దానికంటే డొనేషన్ పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ గురునానక్ ఇంజినీరింగ్ కాలేజీ యాజ మాన్యంపై జేఎన్టీయూహెచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ ఆ యాజమాన్యాన్ని జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ఎం మంజూ ర్ హుస్సేన్ సోమవారం ఆదేశించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా రనీ, విద్యార్థుల సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని ఈనెల ఇచ్చిన ఫీజు కంటే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఈనెల ఒకటిన జేఎన్టీయూహెచ్ వీసీ, రిజిస్ట్రార్‌కు టీఎస్టీసీఈఏ అధ్యక్షులు అయినేని సంతోష్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జేఎన్టీయూ వివరణ ఇవ్వాలంటూ ఆ కాలేజీని ఆదేశించింది. పూర్తి వివరాలను వారంలోగా వర్సిటీతోపాటు సంతోష్ కుమార్‌కు పంపాలంటూ కోరింది. ఆ వర్సిటీ అధికారులు స్పంది ంచడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదే కాలేజీకి చెందిన వంశీకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.