Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేటీఆర్వన్నీ ఒట్టి ఆరోపణలే : వివేక్ వెంకటస్వామి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కోకాపేటలో తమ కంపెనీ కోసం భూములు కొనుక్కోవద్దా అని మంత్రి కేటీఆర్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి.వివేక్ వెంకట స్వామి ప్రశ్నించారు. భూములు కొనుక్కుంటే హవాలా లావాదేవీలు జరి పారని కేటీఆర్ ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. గుజ రాత్ నుంచి వచ్చిన డబ్బుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్‌కు నాయకత్వ లక్షణాలు లేవన్నారు. కేటీఆర్ ఇన్‌చార్జీగా ఉన్న గట్టుప్పల్‌లో టీఆర్ఎస్కు కేవలం 88 ఓట్ల మెజార్టే వచ్చిందనీ, హరీశ్‌రావు ఇన్‌చార్జీగా ఉన్న గ్రామంలో ఆ పార్టీకి ఐదొందలకుపైగా ఆధిక్యత వచ్చిందని చెప్పారు. కేటీఆర్ కంటే హరీశ్ రావు సమర్ధనాయకుడన్నారు. మునుగోడులో నైతిక విజయం బీజేపీదే నన్నారు. సామాజిక తరగతుల వారీగా సమావేశాలు పెట్టినా, పథకాలు తెచ్చినా ప్రజలు టీఆర్ఎస్ను పెద్దగా ఆదరించలేదన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు లేకపోతే టీఆర్ఎస్ అక్కడ గెలవకపోయేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.