Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికి చేపట్టిన ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల సందర్భంగా ఎన్సీసీ అభ్యర్థులకు సంబంధించిన సర్టిపికెట్ల వెరిఫికేషన్‌ను తాము తిరస్కరించలేదని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ స్పష్టం చేసింది. ఎన్సీసీ అభ్యర్థులకు సంబంధించి విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో సంబంధిత డైరెక్టరేట్ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. సోమవారం వరకు విశ్వవిద్యాలయం నుంచి వెరిఫికేషన్ కోసం సర్టిఫికెట్లు రాలేదని తెలిపింది. పై పె చ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఎంఎస్.నెంబర్ 75 (08.09.2015) పై న్యాయ పరమైన కేసులున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులోనే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించింది. ఇప్పటికీ ఆ శాఖ నుంచి వివరణ కోసం ఎదు రు చూస్తున్నామనీ, అభ్యర్థులకు జరిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది.
మాపప్ రౌండ్లో చేర్చాలి
కాళోజీ నారాయణరావు ప్రవేశాల ప్రక్రియపై అభ్యర్థుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఎన్ సీసీ అభ్యర్థులకు సంబంధించి ఆందోళన నెలకొనగా, శారీరక వికలాంగుల కోటాలో పీజీ సీట్లు ఆశించిన వారు సైతం తమకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొదటి రౌండ్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ (శారీరక వికలాంగులు) కోటాకు సంబంధించి మిగిలిన సీట్లన్నింటిని రెండో రౌండ్లో చేర్చకపోవడం వల్ల తాము సీటు పొందలేకపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ మిగిలిన కోటా సీట్లను మాపప్ రౌండ్ లో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.