Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌చుగ్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను మొహరించినా, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముందుకెళ్లినా టీఆర్ఎస్కు దక్కింది కేవలం 10 వేల మెజార్టీనే అని పేర్కొన్నారు. కేసీఆర్ రెండుసార్లు బహిరంగ సభలు పెట్టి ఓడిపోతే పథకాలు రాకుండా చేస్తామని బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని తెలిపారు. కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా రాలేదని విమర్శించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు బీజేపీపైనా, ఎన్నికల గుర్తులపైనా విమర్శలు చేయడం మానుకోవాలనీ, ఎక్కడ లోపం జరిగిందో పరిశీలించుకోవాలని సూచించారు. సీఎం సహా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు మునుగోడు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.