Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సత్యవతి రాథోడ్
నవ తెలంగాణ- యాదాద్రి
మునుగోడు నియోజకవర్గ ప్రజలు సద్దిమూట కట్టి సీఎం కేసీఆర్‌కు ఇచ్చి.. దేశ రాజకీయాల వైపు వెళ్లాలని దీవించారని గిరిజన అభివృద్ధి శ్రీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం యాదాద్రిభువనగిరి జిల్లా యాదాద్రి లకిë నరసింహాస్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఒకప్పుడు సిద్దిపేట ప్రజలు సద్దిమూట కట్టి కేసీఆర్‌కు ఇస్తే తెలంగాణ ఉద్యమంలో దిగ్విజయమై రాష్ట్రాన్ని సాధించారని చెప్పారు. ఇప్పుడు మునుగోడు ప్రజలు మరోసారి సద్ది మూటను ఇచ్చారన్నారు. ఉప ఎన్నికల్లో మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ వైపు నిలిచి తమ అభిమానాన్ని చాటారని తెలిపారు. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించినందుకు ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటామన్నారు. మూడున్నరేండ్ల కాలంలో అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని మంత్రి కేటీఆర్ హామీ మేరకు అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహాస్వామి తగిన బుద్ధి చెప్పారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన సంకల్పంతో అన్ని రాష్ట్రాల్లో గొప్ప అభివృద్ధిని తీసుకురావడం ఖాయమన్నారు. కేసీఆర్‌తోనే దేశంలో గిరిజనులు, దళితులు, రైతులు, మహిళలు సంతోషంగా ఉంటారన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రముఖుల సందర్శన
యాదగిరి నరసింహా క్షేత్రాన్ని సోమవారం మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఏపీ మాజీ మంత్రి పరిటాల సునీత సందర్శించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికారు. శేష వస్త్రాన్ని కప్పి ఆశీర్వచనం.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.