Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడు ఫలితాలపై ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-కంఠేశ్వర్
ఎన్నిక ఏదైనా రాష్ట్ర ప్రజానీకమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని, మునుగోడు ఫలితాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసినట్టు ఎమ్మెల్సీ కవిత అన్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వరాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇన్ని రోజులు అవాకులు, చవాకులు చేసిన బీజేపీ నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని అన్నారు. నల్లగొండలో హ్యాట్రిక్ సాధించామని, ఇక తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టీఆర్ఎస్ వైపే ఉంటారనే విశ్వాసం తనకు ఉందని చెప్పారు.