Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
లాండ్రీ షాపులు, సెలూన్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ సబ్సిడీ బకాయిలను తక్షణమే చెల్లిస్తామని ఆర్థిక శాఖ మంత్రి టి హరీశ్‌రావు హామీ ఇచ్చినట్టు రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి ఆశయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మంత్రిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ కాలేదనే నెపంతో విద్యుత్ శాఖ అధికారులు పలు జిల్లాలో విద్యుత్ బకాయిలు, బిల్లులు చెల్లించాలని లబ్దిదారులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. కనెక్షన్లు కట్ చేస్తున్నారని వివరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ..వెంటనే బకాయి బిల్లులను క్లియరెన్స్ చేస్తామని హామీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో కొండపాక ఎంపీపీ రెగల్ల సుగుణ దుర్గయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శులుసి మల్లేష్, జ్యోతి ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.