Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి లోకల్ క్యాడర్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం (ఎల్సీజీటీఏ) ఎమ్మెల్సీ అభ్యర్థిగా రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ రవీందర్ పోటీ చేయనున్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎల్సీజీటీఏ అధ్యక్షుడు ఎం వీరాచారి, ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మికాంతరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రపతి ఉత్తర్వులు-2018లో సిటీ క్యాడర్ పోస్టులను మల్టీజోన్-2లో కలపడం వల్ల హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులు భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే అవకాశముందని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ క్యాడర్‌ను పునరుద్ధరించడమే లక్ష్యంగా రవీందర్‌ను ఎన్నికల్లో నిలబెట్టామని వివరించారు.