Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.10 లక్షలు, 9 సెల్ఫోన్లు స్వాధీనం : ఎస్పీ రెమా రాజేశ్వరి వెల్లడి
నవతెలంగాణ -నల్లగొండ
తొమ్మిది మంది అంతర్రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.10 లక్షలు, తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
హైదరాబాద్ హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చిన ఓ కేసును రాచకొండ కమిషనరేట్ నుంచి జీరో ఎఫ్ఐఆర్ చేసి చిట్యాల పోలీస్ స్టేషన్‌కు ట్రాన్స్ఫర్ చేేశారు. ఆ కేసుపై చిట్యాల పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 175/2022 సెక్షన్ 379 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దానికి సంబంధించి రెండు సీసీఎస్ స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి దొంగల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో నార్కెట్‌పల్లి శివారులో గల కనకదుర్గ హోటల్, దాబా వద్ద కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారనే సమాచారం పోలీసులకు అందింది. నార్కట్‌పల్లి సీఐ, చిట్యాల ఎస్ఐ సిబ్బందితో వెంటనే అక్కడికి వెళ్లారు. తొమ్మిది మందిని విచారించారు. వీరంతా ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారు.ఇందులో తాజ్, సర్ఫరాజ్ 15 ఏండ్ల నుంచి ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రం చెన్నై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి, విజయవాడ, వైజాగ్, గుంటూరు బస్టాండ్లలో దొంగతనాలు చేస్తున్నారు. ప్రయాణికుల బ్యాగ్‌ల నుంచి డబ్బులు, బంగారం దోచుకున్నారు. గతంలో తాజ్, సర్ఫరాజ్ కలిసి నల్లగొండ, నార్కెట్‌పల్లి, కోదాడ, షాద్‌నగర్, హైదరాబాద్ మహంకాళి, అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేశారు. ఇద్దరు 9 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించారు. ఆ తర్వాత వారు మరికొందరు స్నేహితులు, బంధువులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. దొంగతనాలు చేస్తున్నారు. సోమవారం నార్కెట్‌పల్లి గ్రామ శివారులో గల పూజిత హోటల్ వద్ద బస్సు ఆగింది. బస్సులో నుంచి కొందరు ప్రయాణికులు టిఫిన్ కోసం దిగారు. ఈ సమయంలో దొంగల ముఠాలోని కొందరు పరిసరాలను గమనిస్తుండగా.. మరికొందరు బస్సు ఎక్కి ఒక లగేజీ బ్యాగ్‌లో నగదు దోచుకున్నారు. ఇదే సమయంలో దాబా వద్ద అనుమానాస్పద వ్యక్తులు తిరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తొమ్మిది మంది దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన నల్లగొండ డీఎస్పీ నరసింహారెడ్డి, సీసీఎస్ డీఎస్పీ మొగిలయ్య, సీసీఎస్ సీఐ జితేందర్‌రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ శివరాంరెడ్డిని ఎస్పీ అభినందించారు.