Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదుపు తప్పి మహిళలపైకి దూసుకొచ్చిన వైనం..
- ఇద్దరు మృతి.. ఒకరి పరిస్థితి విషమం
- న్యాయం జరిగే వరకు మృతదేహాలను తరలించొద్దని గ్రామస్తుల ధర్నా
నవతెలంగాణ-రాయపోల్
పత్తి తీయడానికి నడుచుకుంటూ వెళుతున్న ముగ్గురు మహిళలను వెనుక నుంచి లారీ అదుపు తప్పి ఢకొీనడంతో ఇద్దరు మృతిచెందారు. మరొకరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..రాయపోల్ మండల కేంద్రానికి చెందిన చింతకింది కవిత(25), ఇప్ప శ్యామల(42), కొంగరి రాజమణి పత్తి తీయడానికి రోడ్డు వెంట నడుచుకుంటూ పోతున్నారు. జీఎంఆర్ ఫంక్షన్ హాల్ ముందుకు రాగానే.. గజ్వేల్ వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢకొీట్టి అనంతరం కూలీల మీదకు దూసుకొచ్చింది. దాంతో చింతకింది కవిత(25) అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు వచ్చి మహిళలను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఇప్ప శ్యామల(42) కూడా చనిపోయారు. రాజమణి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు.
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి
బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించొద్దని గ్రామస్తులు పెద్దఎత్తున రోడ్డుపై ధర్నా నిర్వహించారు. రోడ్డుపై టెంటు వేసి మూడు గంటలపాటు బైటాయించారు.