Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ ఎమ్డీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
క్రీడాకారులకు ఆత్మస్థైర్యం ఉంటేనే రాణించగలుగుతారని టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ అన్నారు. విజయాలు సాధించేందుకు శిక్షణ, కృషి, పట్టుదల అవసరమని చెప్పారు. గచ్చిబౌలీ స్టేడియంలో మూడ్రోజులపాటు జరిగిన రెండవ జాతీయ మహిళా మాస్టర్స్ అధ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2022 లోపాల్గొన్న ఆర్టీసీ మహిళా ఉద్యోగినులు 15 పతకాలు సాధించడంపట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం పతకాలు సాధించిన క్రీడాకారిణులు మంజుల, శివలీల, సంగీత, సునీత, శ్రీదేవి, స్వరాజ్యలక్ష్మి బస్‌భవన్‌లో ఎమ్డీ సజ్జనార్‌ను కలిశారు. తాము సాధించిన స్వర్ణ, రజత, కాంస్య పతకాలను ఆయనకు చూపారు. విధుల్లో రాణిస్తూనే మహిళా ఉద్యోగులు క్రీడల్లో ప్రతిభ చాటడం పట్ల ఆయన సంతోషం వ్యక్తంచేస్తూ, వారిని అభినందించారు. కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ పర్సనల్ మేనేజర్ ఎన్ కృష్ణకాంత్, టీం ఫిజియోథెరఫిస్ట్ హెమాంష్కుమార్, మేనేజర్ జీపీ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.